ఎస్ఎన్ పాడు: మద్యం దుకాణం స్థలం మార్చాలంటూ వినతి

69చూసినవారు
ఎస్ఎన్ పాడు: మద్యం దుకాణం స్థలం మార్చాలంటూ వినతి
మద్యం దుకాణం స్థలం మార్చాలంటూ డిప్యూటీ తహసిల్దార్ కు ప్రజలు వినతి పత్రం అందజేశారు. నివాస గృహాలు, ఆలయాలు ఉన్నచోట మద్యం దుకాణం వద్దని సంతనూతలపాడులోని పెద్ద బజార్ లో ఉంటున్న పలువురు ప్రజలు శనివారం తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఆ ప్రాంతంలో ఆలయాలు కూడా ఉన్నాయని, మద్యం దుకాణాన్ని అక్కడ నిర్వహించవద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్