పెద్దారవీడు: నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు

50చూసినవారు
పెద్దారవీడు: నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు
ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచెర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నా 200 లీటర్ల బెల్లం ఊటను అధికారులు గుర్తించి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. నాటు సారా తయారీకి ప్రయత్నిస్తున్న వ్యక్తులను గుర్తిస్తున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్