పుల్లలచెరువు మండలం మానేపల్లి సమీపంలోని కొండలలో ఆదివారం మట్టి మాఫియా అక్రమ తవ్వకాలకు చేపట్టింది. జెసిపి సహాయంతో కొండను తవ్వి చదును చేస్తున్నారు. కొంతమంది ట్రాక్టర్ల ద్వారా కూడా మట్టి మాఫియా తరలించి తీసుకువెళ్తున్నారు. ఈ విషయంపై స్థానికులు స్థానిక అధికారులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించిన వారు ఆదివారం కావడంతో అందుబాటులోకి రాలేదు. ప్రజలు సహజ వనరులను అధికారులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.