యర్రగొండపాలెం: వర్షపాతం వివరాలు వెల్లడించిన వాతావరణ శాఖ

54చూసినవారు
యర్రగొండపాలెం: వర్షపాతం వివరాలు వెల్లడించిన వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను కారణంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడ్డాయి. తుఫాను కారణంగా కురిసిన వర్షపాతం వివరాలు గురువారం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దోర్నాల 36. 3, పెద్దారవీడు 14. 6, యర్రగొండపాలెం 22. 2, త్రిపురాంతకం 20. 2, పుల్లలచెరువు 25. 6 ప్రాంతాలలో వర్షపాతం నమోదు అయినట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్