యర్రగొండపాలెంలోని స్థానిక అటవీ ప్రాంతంలో ఓ యువకుడు శవమైతెలాడు. పుల్లలచెరువుకు చెందిన కటారి బ్రహ్మయ్య (19) ఈనెల 11న ఇంటి నుంచి పని కోసమని బయటకు వెళ్ళాడు. ఇంటికి తిరిగి రాకపోయేసరికి బ్రహ్మయ్య కనిపించడం లేదంటూ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గురువారం బ్రహ్మయ్య శవమైతెలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.