ఢిల్లీలో మరోసారి వర్షం బీభత్సంగా మారింది. బుధవారం సాయంత్రం నుంచి ఢిల్లీలో ప్రారంభమైన వర్షాలు రాత్రిపూట కొనసాగాయి. ఆ తర్వాత ఢిల్లీలోని సరితా విహార్, దర్యాగంజ్, ప్రగతి మైదాన్ సహా అనేక ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీని ప్రభావం గురువారం ఉదయం కూడా కనిపించింది. ఈరోజు కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. గురువారం ఉదయం నుంచి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇక్క
ట్లు పడ్డారు.