గర్భా డ్యాన్స్‌ చేస్తూ ప్రముఖ కళాకారుడు గుండెపోటుతో మృతి (వీడియో)

68చూసినవారు
నవరాత్రి ఉత్సవాల్లో గర్భా డ్యాన్స్‌ చేస్తూ ఓ కళాకారుడు కుప్పకూలి మృతి చెందాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని పూణెలో సోమవారం చోటు చేసుకుంది. ఖేడ్‌ గ్రామంలో జరిగిన నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు అశోక్ మాలీ (54) ఓ బాలుడితో కలిసి హుషారుగా గర్బా ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శన చేస్తున్న క్రమంలో అతడికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్