వైసీపీకి హోం మంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధం.. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా? అని చాలెంజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో రూ.92 కోట్లు. అంతకు మించి అవినీతి జరిగిందని ఎలా చెబుతారు? అంటూ మండిపడ్డారు. ఖాజానా ఖాళీ చేసేసి.. అవినీతి ఖాజానా అంటారా? ఖాజానాలో సొమ్ముని తన జమానాలోనే జగన్ జమ చేసేసుకున్నారు అంటూ అనిత ఫైర్ అయ్యారు.