AP: తనపై నమోదైన ఏసీబీ కేసుపై వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని తాజాగా స్పందించారు. తనపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందన్నారు. ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఇలాంటి కేసులకు తాను భయపడనని, న్యాయ పోరాటం చేస్తానని ఆమె పేర్కొన్నారు. కాగా, స్టోన్‌క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంలో విడదల రజినిపై ఏసీబీ కేసు పెట్టింది.