AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న (85) మృతిపై భార్య అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించారు. తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఆయన శరీరంపై గాయాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ మేరకు నమూనాలను సేకరించారు. కాగా, ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, కడప ఎస్పీ, పులివెందుల టీటీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి కూడా అనుమానాలు లేవనెత్తారు.