అనాథ బాలికకు రూ.10 లక్షల సాయం: సీఎం చంద్రబాబు

72చూసినవారు
అనాథ బాలికకు రూ.10 లక్షల సాయం: సీఎం చంద్రబాబు
నంద్యాల జిల్లా చిన్నవంగలిలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గురుశేఖర్, అతని భార్య, ఇద్దరు కూతుళ్లు మృతి చెందగా.. మరో కూతురు ప్రసన్న(15) అనాథగా మిగిలింది. ఆమెకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన సీఎం, ఆమెను సంరక్షిస్తున్న నానమ్మకు రూ. 2 లక్షలు అందిస్తామన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో అండగా ఉంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్