TG: డీలిమిటేషన్ విధానంపై చెన్నై వేదికగా జరుగుతోన్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో ఆయన మాట్లాడారు. డీమిలిటేషన్ కు తాము పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ తో తీరని అన్యాయం జరగబోతోందని చెప్పారు. డీమిలిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల మాటకు ఏమాత్రం విలువ లేకుండాపోయే ప్రమాదం ఉందన్నారు.