TG: మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట బస్సుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా HYD హకీంపేటకు చెందిన ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలు ఎక్కారు. ఉన్నట్టుండి ముగ్గురు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో చెప్పులు, బూట్లతో కొట్టుకున్నారు. కండక్టర్ వారించినా వినకపోవడంతో చివరకు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా సదరు మహిళలు తాగి గొడవ పడినట్లు తెలుస్తోంది.