AP: తిరుపతిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఓ బాలిక రెండో ఫ్లోర్ పైనుంచి కింద పడింది. బాలిక నడుము విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థినుల మధ్య గొడవ జరిగిన సమయంలో తోటి విద్యార్థిని ఆమెను పైనుంచి తోసేసిందని మాచారం. ఈ ఘటనపై తిరుపతి అర్భన్ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.