AP: గ్రేటర్ విశాఖలో వైసీపీకి పార్టీకి ఊహించని షాక్ తగలనుంది. 74వ వార్డు కార్పొరేటర్ టి. వంశీ రెడ్డి.. టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం అయ్యారు. గాజువాక ప్రాంతానికి చెందిన వంశీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. పార్టీ మారడం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అయితే, టి. వంశీ రెడ్డి తండ్రి నాగిరెడ్డి 2019 ఎన్నికల్లో.. గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయం సాధించారు.