బాల్యంలో తల్లిదండ్రుల విడాకులు చూసిన 65, అంతకంటే ఎక్కువ వయసున్న అమెరికన్లలో గుండెపోటుకు అవకాశం ఎక్కువని 2022 బిహేవియరల్ రిస్క్ ఫ్యాక్టర్ సర్వీలెన్స్ సిస్టమ్ (BRFSS) సర్వే డేటాను ఉపయోగించి చేసిన ఒక అధ్యయనం తేల్చింది. షుగర్, డిప్రెషన్‌తో వచ్చే అనారోగ్య సమస్యలే ఈ పరిస్థితిలోనూ వచ్చే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. బాల్యంలో అనుభవించిన పేదరికం, అవమానం వంటి అంశాలు కూడా ఇందుకు దోహదపడతాయని చెప్పింది.