నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి తీవ్రంగా ఎండ కాసి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వాతావరణం లో మార్పులు చోటుచేసుకునే ఆకాశంలో మబ్బులు ఏర్పడ్డాయి. మరో తుఫాన్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా ఈ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాకు ముప్పు పొంచి ఉందా లేదనేది తెలియాల్సి ఉంది. గత వారం రోజులు క్రితం వచ్చిన తుఫాన్ కు జిల్లా ప్రజలు సతమతమయ్యారు.