ఆత్మకూరులో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం తమ కార్యచరణ గురించి యూనియన్ సభ్యులతో చర్చించారు. ఈ భవనాన్ని తమకు ఉచితంగా ఇచ్చిన జగదీష్, శ్రీనివాసులకు యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.