నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని పలు చిన్న గ్రామాల్లోనూ బాణసంచా విక్రయిస్తున్నారు. బాణసంచా పట్టణాలకు దూరంగా కొన్ని ప్రాంతాల్లో చెరువులకు దగ్గరగా దుకాణాలు పోలీసులు ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ పోలీసులు కళ్ళు కప్పి కొందరు పెద్ద పెద్ద గ్రామపంచాయతీలోనూ టపాసులు అమ్మడం చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే చుట్టుపక్కల ఉన్న గృహాల ప్రజలు ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.