ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను, డిసిసి మాజీ చైర్మన్ ధనుంజయ రెడ్డి, టిడిపి నేత గిరినాయుడుతో కలిసి, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం, డిన్నర్ ఐటమ్స్‌తో క్యాంటీన్‌కు వచ్చిన ప్రజలకు మొదటి రోజు ఉచితంగా ఆహారాన్ని అందించారు.