చిలకలమర్రిలో విజయ్ దివస్

63చూసినవారు
చిలకలమర్రిలో విజయ్ దివస్
అనంతసాగరం మండలం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సురేష్ ఆధ్వర్యంలో సోమవారం విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 1971 భారత్ - పాక్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై సాధించిన విజయానికి గుర్తుగా విజయ్ దివస్ కార్యక్రమాన్ని డిసెంబర్ 16న నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు జాతీయ జెండాలను ప్రదర్శించారు. యుద్ధ వీర సైనికులకు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్