కందుకూరు పట్టణంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో కందుకూరు పట్టణంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ సిబ్బంది కలిసి రూ. 1, 23, 060 విరాళంగా ఎమ్మెల్యేకు అందజేశారు. నగదు ముఖ్యమంత్రి చంద్రబాబు కు అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.