కందుకూరు పట్టణంలోని వెంకటనారాయణ బజార్ లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ పాల్గొన్నారు. వారు పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.