అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు

75చూసినవారు
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మున్నేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఎస్సై అంకమ్మరావు తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ల పై కేసులను నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్