కావలి: డీఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి
కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి డిఎస్పి శ్రీధర్ ను బుధవారం ఆయన కార్యాలయంలో కలిశారు. కావలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల పై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. అలాగే పోలీసులకు వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా, వ్యక్తులు కూడా ఫిర్యాదులు అందజేస్తారని వాటిని కూడా పరిశీలించాలని కోరారు. తమ వాళ్లపై కూడా తప్పుడు పోస్టులు పెట్టారన్నారు.