కావలి: జెసిబి దొంగలించిన వ్యక్తులు అరెస్ట్
కావలి సబ్ డివిజన్ పరిధిలోని అల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బలిజ పాలెం లో అక్టోబర్ 29వ తేదీ రాత్రి ఒక జెసిబి దొంగలించబడింది. ఈ ఘటనపై కావలి డిఎస్పి శ్రీధర్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బండ్ల మోజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఉలవపాడు క్రాస్ రోడ్డు వద్ద ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసి విచారించగా ఒక పొలంలో జెసిబి దాచినట్లు తెలుసుకొని జెసిబిని సీజ్ చేసినట్లు డిఎస్పి తెలిపారు.