
కావలి నియోజకవర్గంలో 51 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
కావలి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సీఎం సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 92 మంది లబ్ధిదారులకు రూ. 80, 79, 427 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో 51 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని తెలిపారు.