నెల్లూరు జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖమంత్రి జ్యోతిరాధిత్య సిండియా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలానికి చెందిన కటారి రమణయ్య, కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలేనికి చెందిన గుర్రం మాల్యాద్రి, నెల్లూరు వరల్డ్ కు చెందిన బొప్పూరు ప్రసాద్‌తో పాటు పలువురిని నియమించారు.