నెల్లూరు పట్టణంలోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఎంపీని టిడిపి నాయకులు మంగళవారం కలిశారు. పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులుగా నియమితులైన వేమిరెడ్డిని ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలను శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జెడ్పీ చెంచల బాబు యాదవ్, దుత్తలూరు మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ రియాజ్ ఉన్నారు.