రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మైనార్టీ కోటాలో సాబీర్ ఖాన్ పేరు ఈ జాబితాలో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయి పదవి లేదా జిల్లా స్థాయిలో కీలకమైన పదవి కి సంబంధించి సాబీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. గత ఐదేళ్లుగా వైసిపి హాయంలో ఆయనపై 18 కేసులు నమోదయ్యాయి.