నెల్లూరు నగరాన్ని గత 15 రోజులుగా వర్షాలు వీడడం లేదు. పెంగల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా వర్షాలతో అతలాకుతలమైంది. అనేక చెరువులు వాగులు, పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. గురువారం పలు విడతలుగా నెల్లూరు జిల్లావ్యాప్తంగా వర్షం పడింది. పనులు లేక సాధారణ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్నా నది నీటితో కళకళలాడుతుంది