నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 19 డివిజన్ శ్రీహరి నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని కార్పొరేషన్ హెల్త్ అధికారులు సీజ్ చేశారు. వాటర్ ప్లాంట్ యజమాని లక్ష్మీనారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడంతో అధికార పార్టీపై పలు విమర్శలు చేశారు. కార్పొరేషన్ హెల్త్ అధికారి చైతన్య వాటర్ ప్లాంట్ ను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు కారణాలు తెలియజేశారు.