నెల్లూరు నగరంలోని ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గణేష్ ఘాట్ ను కాశి ఘాటును తలపించేలా ఏర్పాటు చేస్తున్నామని రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు, శనివారం గణేష్ ఘాట్ వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ నెల 15వ తేదీన కార్తీక దీపోత్సవం సందర్భంగా ఆరోజు సాయంత్రం 6 గంటలకు మహిళలతో శోభాయాత్ర, 108 తెప్పలతో శివాకృతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.