సర్వభూపాల వాహనంపై ఊరేగిన వెంకయ్య స్వామి

68చూసినవారు
సర్వభూపాల వాహనంపై ఊరేగిన వెంకయ్య స్వామి
వెంకటాచలం మండలంలోని గొలగమూడి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన ఆదివారం ఉదయం భగవాన్ వెంకయ్య స్వామికి సర్వ భూపాల వాహనంపై ఊరేగింపు జరిగింది. మంగళ వాయిద్యాలు మోగుతుండగా భక్తులు కోలాటాలు, భజనలు చేస్తుండగా ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. గ్రామంలో ఊరేగుతున్న స్వామికి గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్