నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలంలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. మండలంలోని చాకల కొండ గ్రామంలో కార్తికేయ రైతు డిపోలో తనిఖీలు నిర్వహించారు. బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు జరపడం, ఎరువుల అమ్మకాలలో వ్యత్యాసాలను గుర్తించి కార్తికేయ రైతు డిపోలోని 15. 25 టన్నులు రూ. 2, 96, 013 విలువచేసే ఎరువలను సీజ్ చేశారు. ఎరువుల అమ్మకాలలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.