ఉదయగిరి మండలానికి చెందిన దంపతులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు. మండలంలోని షేక్ ఖాదర్ భా, పటాన్ సందాని బేగం దంపతులు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. గురువారం నెల్లూరు లో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఒకేసారి దంపతులు అవార్డులు అందుకోవడంతో మండలంలోని తోటి ఉపాధ్యాయులు వారికి అభినందనలు తెలిపారు.