ఉదయగిరిలో శ్రీ సంతానలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

79చూసినవారు
ఉదయగిరిలో శ్రీ సంతానలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
ఉదయగిరిలో స్వయంభుగా వెలిసియున్న శ్రీ శ్రీ సంతాన లక్ష్మీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ సోమవారం నుండి 21 శుక్రవారం వరకు జరగనున్నట్లు ఆలయ అర్చకులు లోకా వెంకటప్రసాద్ శర్మ సోమవారం తెలిపారు. అమ్మవారి తిరుణాలలో మూడో రోజు 19వ తేదీ సంతానం లేని దంపతులకు అమ్మవారి మహా ప్రసాదం ఇవ్వటo జరుగుతుందని తెలియజేశారు. మరింత సమాచారం కొరకు ఆలయ అర్చకులు 8688254260 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్