ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం పాపం పల్లి గ్రామంలో వ్యాధి నిరోధక టీకాల హెడ్ కౌంట్ పై బుధవారం ఇంటిని సర్వే నిర్వహించారు. ఈ సర్వేను దుత్తలూరు హెల్త్ సూపర్వైజర్ షేక్. ఖాజా మొహిద్దిన్ సందర్శించారు. ఈ సందర్భంగా గర్భవతులు, బాలింతలతో ఆయన మాట్లాడారు. పిల్లలకు వేయించాల్సిన టీకాలపై అవగాహన కల్పించారు. ఈ సర్వే ను ఆశా కార్యకర్తలు పక్కాగా నిర్వహించాలని తెలిపారు. అలాగే ఎంసీపీ కార్డులను పరిశీలించారు.