మండల కేంద్రమైన వింజమూరు బీసీ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా ఉదయగిరి నియోజకవర్గం సమన్వయ కర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనారోగ్యం తో మరణించిన నాయబ్ కుటుంబం సభ్యులకి తక్షణ ఆర్ధిక సహాయం అందజేసి, కుటుంబ సభ్యులకు అండగా
వైసీపీ ప్రభుత్వం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు పాల్గొన్నారు.