వింజమూరు మండల కేంద్రంలో ఎస్వీ కన్వెన్షన్ హాల్ నందు మంగళవారం ఉదయం 9 గంటలకు ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆత్మీయ సమావేశం జరగనుంది. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరవుతారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.