విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం రెండవ రోజు అనంతపురం నగరంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరసన దీక్షకు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి మాట్లాడుతూ. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదన్నారు.