చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం సమావేశమయ్యారు. ధర్మవరంలో పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి చేనేతలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను జేపీపీ సత్యనారాయణ మూర్తి, చేనేత కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరావు సీఎం చంద్రబాబుకు వివరించి వినతిపత్రం అందజేశారు. చేనేత సమస్యలపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.