ధర్మవరం రూరల్ పోతుకుంట రోడ్డు సత్య సాయి నగర్ ప్రజలు డ్రైనేజ్ కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ప్రజలు చేసిన ఫిర్యాదుల మేరకు మంత్రి సత్య కుమార్ కార్యాలయం ఇన్ఛార్జ్ హరీష్ బాబు, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్తో కలిసి బుధవారం సత్య సాయి నగర్ లో పర్యటించారు. హరీష్ బాబు మాట్లాడుతూ. డ్రైనేజీ కాలువలు సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.