గుత్తి పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఓ మోస్తారు వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఉక్కపోతకు అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం రాకతో కాస్త ఉపశమనం లభించింది. మరోపక్క వర్షం రాకతో పంటల సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో డ్రైనేజీ మురికి నీరు రోడ్డు మీదకు పారాయి.