గుత్తి పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు దసరా సెలవులలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని మండల విద్యాధికారి రవి నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ. దసరా సెలవులు ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకు ఉంటాయని ఈ సెలవులలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే అట్టి పాఠశాల పై చర్యలు తీసుకుంటామని ముందునే హెచ్చరిస్తున్నామని తెలిపారు.