అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీ సర్కిల్ సమీపంలో శుక్రవారం కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, సీఐ వెంకటేశ్వర్లు రిబ్బన్ కత్తిరించి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం మహా పుణ్య కార్యమన్నారు. కమ్మ సేవా సంఘం అధ్యక్షులు సూరి, కార్యదర్శులు మల్లి తదితరులు పాల్గొన్నారు.