శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని గుడ్డం రంగనాథ స్వామి కోనేరులో గణపతి నిమర్జనానికి అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనేరులో నీరు లేకపోవడంతో అందులో ఉన్న చెత్తాచెదారాన్ని జెసిబి తో తొలగించి గత వారం రోజుల నుండి కమిషనర్ నీటితో నింపుతున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కోనేరులో నిమజ్జనానికి అధికారులు సిద్ధమయ్యారు. గురువారం ఏర్పాటను పరిశీలించారు.