కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానం, తిరువీధులు, కోనేరు (భృగుతీర్ధం) ఆలయ అభివృద్ధికి చేయవలసిన పనులను మంగళవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి గురుంచి అర్చకులు, ఆలయ ఈవోతో ఎమ్మెల్యే చర్చించారు. అనంతరం కోనేరును పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏమ్. ఏస్. పార్థసారథి, కూటమి నాయకులు పాల్గొన్నారు.