కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా నాయకులు అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగన్మోహన్, రామ్మోహన్, బాబ్జాన్, ముస్తక్, సిపిఐ నాయకులు లియాకత్, పవన్ కుమార్, మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు.