కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. తహశీల్దార్ భాస్కర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో రూపొందించబడిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే హక్కులు, బాధ్యతలు గురించి తెలుస్తాయన్నారు. కాబట్టి చట్టాలు, న్యాయం పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలన్నారు.